Homeటాప్ స్టోరీస్ఆర్ధిక ఇబ్బందుల్లో నటి

ఆర్ధిక ఇబ్బందుల్లో నటి

Kannada actress Vijayalaxmi facing financial problemsకన్నడ నటి విజయలక్ష్మి ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతోంది . అంతేకాదు ఒకవైపు ఆర్ధిక ఇబ్బందులు మరోవైపు అనారోగ్యంతో బాధపడుతోంది . కన్నడ చిత్రాల్లో నటించిన విజయలక్ష్మి కెరీర్ అనుకున్న స్థాయిలో ఊపందుకోకపోవడంతో సీరియల్ లలో కూడా నటించడానికి సిద్ధమైంది . పలు సీరియల్ లలో నటించింది కూడా . అయితే ఇటీవలే విజయలక్ష్మి తల్లి ఆసుపత్రిలో చేరగా పెద్ద మొత్తంలో వైద్యానికి ఖర్చు చేయాల్సి వచ్చిందట .

 

- Advertisement -

ఆ బాధ నుండి తేరుకోకముందే విజయలక్ష్మి కి బిపి , షుగర్ లు ఎక్కువైపోయి అనారోగ్యం దరి చేరింది . అనారోగ్యం మరీ ముదరడంతో బెంగుళూర్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది . అయితే విజయలక్ష్మి వైద్యానికి డబ్బులు లేవట దాంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం , సినిమా రంగంవాళ్ళు కానీ టివి రంగం వాళ్ళు కానీ మా అక్కని ఆదుకోండి అంటూ వేడుకుంటోంది విజయలక్ష్మి చెల్లెలు .

English Title : Kannada actress Vijayalaxmi facing financial problems

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All