Homeటాప్ స్టోరీస్క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోనూ డ్ర‌గ్స్ దందా న‌డుస్తోందా?

క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోనూ డ్ర‌గ్స్ దందా న‌డుస్తోందా?

 

kannada actors and musicians using drugs
kannada actors and musicians using drugs

క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. టాలీవుడ్‌లో సినీ స్టార్స్‌, డైరెక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌ని డ్ర‌క్ రంట్రోల్ బోర్డ్ ఎంక్వైరీకి పిల‌వ‌డం, దీనిపై ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌జ‌ర‌గ‌డం తెలిసిందే. తాజాగా క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లంగా మారింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో కీల‌క ముద్దాయిగా మారిన రియా చ‌క్ర‌వ‌ర్తి కి డ్ర‌గ్ మాఫియాకు సంబంధాలున్నాయ‌ని బ‌య‌ట‌ప‌డిన వెంట‌నే క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం  సృష్టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -

మాద‌క ద్ర‌వ్యాల‌ని ముంబైలో స‌ర‌ఫ‌రా చేసే కీల‌క వ్య‌క్తితో రియా చాట్ చేసిన వాట్సాప్ చాట్ లీక్ అయిన వేళ బెంగ‌ళూరులో డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డ‌టం, ఆ డ్ర‌గ్స్ పార్శిల్ లిస్ట్‌లో క‌న్న‌డ ఇండస్ట్రీకి చెందిన ప‌లువురు స్టార్స్‌, మ్యుజీషియ‌న్స్ పేర్లు వున్న‌ట్టు తేల‌డం సంచ‌ల‌నంగా మారింది. బెంగ‌ళూరులోని ఓ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ రాకెట్ గుట్టును నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓ హోట‌ల్‌లో 145 ఎండీ ఎంఏ డ్ర‌గ్ పిల్స్‌ని, 2.2  ఓ హోట‌ల్‌లో 145 ఎండీ ఎంఏ డ్ర‌గ్ పిల్స్‌ని, 2.20 ల‌క్ష‌ల న‌గ‌దును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ సంద‌ర్భంగా పలువురు డ్ర‌గ్ స‌ర‌ఫ‌రా చేస్తున్న వ్య‌క్తుల్ని అరెస్ట్ చేశారు. వీరంతా క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టుల‌కు, సంగీత ద‌ర్శ‌కుల‌కు, విద్యార్థుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్టు పోలీస్ విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All