Homeఎక్స్ క్లూసివ్వివాదాస్పద నటి సినిమా హిట్ అవుతుందా ?

వివాదాస్పద నటి సినిమా హిట్ అవుతుందా ?

Kangana ranaut hopes on Manikarnika
Kangana Ranaut

కంగనా రనౌత్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే . తాజాగా ఈ భామ ”మణికర్ణిక , ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రానికి దర్శకుడు మన టాలీవుడ్ దర్శకుడు క్రిష్ అయితే షూటింగ్ మధ్యలో క్రిష్ కు కంగనా రనౌత్ కు విబేధాలు వచ్చాయి దాంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు . క్రిష్ తప్పుకోవడంతో బ్యాలెన్స్ గా ఉన్న సినిమాని కంప్లీట్ చేసింది కంగనా .

ఇక ఈ సినిమా ఈనెల 25 న భారీ ఎత్తున విడుదల కానుంది . వీర నారి ఝాన్సీ లక్ష్మీభాయ్ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాబట్టి తప్పకుండా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది . వీరత్వానికి పరాకాష్ట గా నిలిచిన కథ కాబట్టి తప్పకుండా హిట్ కావాల్సిందే . అయితే టేకింగ్ ఎలా ఉంది అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది . కంగనా రనౌత్ అంటే వివాదాల రారాణి . ఈ భామ చాలాకాలంగా ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటోంది . తాజాగా క్రిష్ కూడా దూరమయ్యాడు . దాంతో మిగతా సినిమాని కంగనా దర్శకత్వం వహించింది . సరిగ్గా వచ్చిందా ? లేదా ? హిట్ అవుతుందా ? లేదా అన్నది ఈనెల 25న తేలనుంది .

- Advertisement -

English Title: Kangana ranaut hopes on Manikarnika

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All