
కన్నడ రాక్ స్టార్ యశ్..పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన మూవీ కెజిఎఫ్ 2 . గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. సౌత్ లోనే కాదు నార్త్ లోను రెండు రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. ప్రస్తుతం ఈ మూవీ ఫై సినీ ప్రముఖులు స్పందిస్తూ..సినిమాకు మరింత బజ్ తెస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ అండ్ వివాదస్పద నటి కంగనా ..యశ్ ఫై పలు కామెంట్స్ చేసింది.
ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కేజీఎఫ్ చాప్టర్ 2 పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ సందర్భంగా ‘కొన్ని సంవత్సరాలుగా భారత చలన చిత్ర పరిశ్రమ మిస్ అవుతున్న యాగ్రీ యంగ్ మ్యాన్ యశ్. అమితాబ్ బచ్చన్ తర్వాత 1970ల నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు దానిని యశ్ భర్తీ చేయబోతున్నాడు’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక సౌత్ హీరో అయిన యశ్‌ను ఏకంగా బాలీవుడ్ బిగ్‌బీతో పోల్చడంతో ఈ రాక్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా కంగనాకు థ్యాంక్య్‌కు చెబుతూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.