Homeటాప్ స్టోరీస్కమల్ హాసన్ పై చెప్పులతో దాడి

కమల్ హాసన్ పై చెప్పులతో దాడి

హీరో కమల్ హాసన్ పై చెప్పులతో దాడి చేశారు బిజెపి కార్యకర్తలు . తమిళనాట ఎన్నికలు జరుగుతుండగా ప్రచారంలో భాగంగా నిన్న తమిళనాడులో ఓ రోడ్ షోలో పాల్గొన్నాడు కమల్ . అయితే ఆ రోడ్ షోలో కమల్ హాసన్ పై చెప్పులతో దాడి చేయగా కమల్ వాటి నుండి తప్పించుకున్నాడు . ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకకాలంలో పదుల సంఖ్యలో దాడికి పాల్పడ్డారు దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాడికి పాల్పడుతున్న వాళ్ళని అరెస్ట్ చేశారు .

- Advertisement -

గాంధీ ని చంపిన గాడ్సే హిందూ తీవ్రవాది అంటూ కమల్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంతమంది హిందువులు కమల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే . అలాగే పెద్ద ఎత్తున కమల్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు . ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ కమల్ వ్యాఖ్యలను పెద్ద ఎత్తున వ్యతిరేకించింది . ఇక కొంతమంది కమల్ పై దాడికి పాల్పడగా కమల్ హాసన్ వాటి నుండి బయట పడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All