Homeటాప్ స్టోరీస్క‌ల్యాణ్‌ రామ్ ఏంటీ ఇలా మారిపోయాడు?

క‌ల్యాణ్‌ రామ్ ఏంటీ ఇలా మారిపోయాడు?

క‌ల్యాణ్‌రామ్ ఏంటీ ఇలా మారిపోయాడు?
క‌ల్యాణ్‌రామ్ ఏంటీ ఇలా మారిపోయాడు?

నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ కొత్త త‌ర‌హా చిత్రాల్లో న‌టించాల‌ని, ఏదైనా కొత్త‌గా ట్రై చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. క‌థ‌ని న‌మ్మి సినిమాలు చేస్తుంటారు. అలా ఆయ‌న చేసిన కొన్ని చిత్రాలు మంచి ఫిలితాల్ని అందిస్తే మ‌రికొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఫ్లాపులుగా నిలిచాయి. ఇటీవ‌ల వేగేశ్న స‌తీష్‌తో క‌ల్యాణ్‌ రామ్ చేసిన `ఎంత మంది వాడ‌వురా` చిత్రం సంక్రాంతికి విడుద‌లై ఊహించ‌ని విధంగా ఫ్లాప్ అయింది. ఈ చిత్రంపై అటు నిర్మాత ఉమేష్ గుప్తా, ఇటు హీరో క‌ల్యాణ్‌రామ్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

అయితే వారి అంచ‌నాల‌ని త‌ల కిందులు చేస్తూ ఫ్లాప్ కావ‌డం చిత్ర వ‌ర్గాల‌ని షాక్‌కు గురిచేసింది. ఈ సినిమా త‌రువాత క‌ల్యాణ్‌రామ్ కొత్త ద‌ర్శ‌కుడితో భారీ సోషియో ఫాంట‌సీ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్న‌ట్టు తెలిసింది. `ఢీ` ఫేమ్ నిర్మాత మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణరెడ్డి త‌న‌యుడు మ‌ల్లిడి వేణు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిఆ ప‌రిచ‌యం కాబోతున్నారు. 13వ శ‌త‌బ్దానికి చెందిన క‌థ ఇద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ సినిమా కోసం క‌ల్యాణ్‌రామ్ స‌రికొత్త గెట‌ప్‌లో గుబురు గ‌డ్డం, మీసం, జ‌ట్టుతో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆ లుక్‌లోకి మారిన క‌ల్యాణ్‌రామ్ తాజాగా అపోలో లైఫ్ స్టూడియో జిమ్ నుంచి బ‌య‌టికి వ‌స్తుండ‌గా కెమెరాల‌కు చిక్కారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్నివిశేషాల్ని చిత్ర వ‌ర్గాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిసింది.

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All