
‘ఎంతమంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’, ‘కంచె’ సినిమాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా..కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 05 న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్‌తో మనకు కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. హిస్టారికల్ కంటెంట్‌కు ఫిక్షన్ అంశాన్ని జోడించి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కు భారీ బడ్జెట్ పెడుతున్నారు.