Homeటాప్ స్టోరీస్క‌ల్యాణ్‌దేవ్ హీరోగా ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

క‌ల్యాణ్‌దేవ్ హీరోగా ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

క‌ల్యాణ్‌దేవ్ హీరోగా ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం
క‌ల్యాణ్‌దేవ్ హీరోగా ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

మెగాస్టార్ చిన్న‌ల్లుగు క‌ల్యాన్ దేవ్‌ హీరోగా మ‌రో చిత్రం మొద‌లైంది. `అశ్వ‌ద్ధామ‌` ఫేమ్ ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, శుభం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్  బ్యాన‌ర్‌పై  రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఈ చిత్రాన్ని ర‌జ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌ నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి తుల‌సి వ‌నంలో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు.

`విజేత‌` వంటి హిట్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన క‌ల్యాణ్ దేవ్ ప్ర‌స్తుతం `సూప‌ర్ మ‌చ్చి` చిత్రంలో న‌టిస్తున్నారు. క‌ల్యాణ్‌దేవ్ హీరోగా న‌టిస్తున్న మూడ‌వ చిత్ర‌మిది. ఈ చిత్రానికి సాయితేజ క‌థ‌, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ `క‌ల్కి` చిత్రానికి క‌థ అందించారు. ఛ‌లో , భీష్మ వంటి మ్యూజిక‌ల్ హిట్ చిత్రాల‌కు సంగీతం అందించిన మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ నెల 14న ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ మూవీ టైటిల్‌ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతోంది. ఈ మూవీ ప్రారంభోత్స‌వానికి యువ ద‌ర్శ‌కులు ప్ర‌ణీత్‌, వేణు ఊడుగుల‌, వెంకీ కుడుముల ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All