Homeన్యూస్"కాంతారా" కోవలో "కలివీరుడు"

“కాంతారా” కోవలో “కలివీరుడు”

"కాంతారా" కోవలో "కలివీరుడు"
“కాంతారా” కోవలో “కలివీరుడు”

ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న
“మినిమం గ్యారంటీ మూవీస్” అధినేత ఎమ్.అచ్చిబాబు

కె.జి.ఎఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ “కాంతారా”తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. “కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ… రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది!!
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని… “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. “అవి” దర్శకత్వంలో… రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. “కాంతారా” కోవలో “కలివీరుడు” తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు!!
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పోస్టర్స్: విక్రమ్ ఎ.హెచ్ – అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం: హలేష్ ఎస్, ఎడిటర్: ఎ.ఆర్.కృష్ణ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రాఘవేంద్ర, నిర్మాత: ఎమ్.అచ్చిబాబు, రచన – దర్శకత్వం: అవి!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All