
ప్రస్తుతం కాజల్ కడుపుతో ఉంది..మరికొద్ది రోజుల్లో ఓ బేబీ కి జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పాటుమెటర్నిటి ఫొటో షూట్స్ చేస్తూ ఫాలోయర్స్ ను అలరిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. లక్ష్మి కళ్యాణం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కాజల్..మగధీర మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకుంది.ఆ తర్వాత వరుస అగ్ర హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్’, తమిళ చిత్రం ‘రౌడీ బేబీ’ నుంచి కూడా బయటకు వచ్చేసింది. ఇక సినిమాల్లో ఉన్నప్పుడే కాదు ప్రస్తుతం తల్లికాబోతున్నప్పటికీ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. తాజాగా మెటర్నిటి ఫొటో షూట్ లో పాల్గొంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. అవి నెట్టింట వైరలవుతున్నాయి. మాతృత్వపు అనుభూతులను గుర్తుపెట్టుకోవల్సిన అవసరం నేపథ్యంలో ఇటీవల మెటర్నిటి ఫొటో షూట్స్ వచ్చాయి. అలా ఓ ట్రెండు లాగా ఇవి సాగిపోతున్నాయి.
అమ్మతనాన్ని ఆస్వాదించడం ఓ గొప్ప వరం. కాగా, మాతృత్వపు అనుభూతులను చక్కగా ఆస్వాదిస్తోంది కాజల్ అగర్వాల్. ఎంతో అందంగా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నానని, కొంచెం అయోమయంగా ఉందని, ఓ క్షణం అందంగా, మరో క్షణం అయోమయంగా, అలా మనసులో గజిబిజీలోనే ఎన్నో భావోద్వేగాలు పుట్టుకొస్తున్నాయని, అవన్నీ కలిపితేనే అసలు కథ అవుతుందని పేర్కొంటూ తన మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోలు, వీడియో షేర్ చేసింది.