
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ట్రైలర్ ను మంగళవారం విడుదల చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచారు. ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నింపేశారు. అలాగే చరణ్, చిరంజీవి , పూజా ల సన్నివేశాలతో నింపేశారు. అయితే ట్రైలర్ లో ఎక్కడ కూడా కాజల్ ను చూపించకపోవడం తో అభిమానులు అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
కొరటాల శివ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆచార్య సినిమాలో కాజల్ కు కొరటాల అన్యాయం చేశాడంటూ ఆమె అభిమానులు అంటున్నారు. ఎందుకంటే నిన్న విడుదలైన ట్రైలర్ లో కాజల్ను కనీసం ఒక్కటంటే ఒక్క షాట్ లో కూడా చూపించలేదు. చరణ్ సరసన నటించిన పూజా హెగ్డేకు మాత్రం ట్రైలర్లో మంచి స్పేస్ దక్కింది. దీంతో కాజల్ పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత ఉండదని.. సినిమా కథ మొత్తం చరణ్ పాత్ర పై ఆధారపడి నడుస్తుంది కాబట్టి.. పూజ హెగ్డేను చూపించి కాజల్ ను పక్కకు పెట్టారని అంటున్నారు. మరి నిజంగానే కొరటాల ఆలా చేసారా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.