Homeటాప్ స్టోరీస్పండంటి బాబుకు జన్మినిచ్చిన కాజల్

పండంటి బాబుకు జన్మినిచ్చిన కాజల్

kajal-aggarwal-blessed-with-baby-boy
kajal-aggarwal-blessed-with-baby-boy

చందమామ ఫేమ్ కాజల్ మంగళవారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని కాజల్‌, గౌతమ్‌ ఇరు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. కాజల్‌ పీఆర్‌ టీమ్‌ నుంచి ఈ విషయం బయటికొచ్చింది. కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ కాజల్‌ డెలివరీ గురించి ఇన్‌స్టాలో హింట్‌ ఇచ్చారు. ‘‘స్పెషల్‌ న్యూస్‌ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకున్న కాజల్..ముంబైలోని వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడింది.

కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన సంప్రదాయ పద్దతుల్లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆచార్య షూటింగులో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ ప్రెగ్రెంట్ అయ్యారనే వార్తను గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ వరుస ఫోటో షూట్స్ తో ఫాలోయర్స్ ను అలరించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All