Homeటాప్ స్టోరీస్నాటకం చిత్రం దర్శకుడి రెండో చిత్రం "కాదల్" షూటింగ్ ప్రారంభం

నాటకం చిత్రం దర్శకుడి రెండో చిత్రం “కాదల్” షూటింగ్ ప్రారంభం

kadal movie press meetనాటకం చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ తో బిజినెస్ సర్కిల్స్ లో తెగ హడావిడి చేసి మంచి బిజినెస్ చేసింది. ఆ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్ జి గోగణ. ఇప్పుడీ దర్శకుడి రెండో సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కాకినాడలో ఈరోజు మొదలుపెట్టారు. ప్రేమికుల దినోత్సవ  కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విశ్వాంత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రం కావడం… టైటిల్ నే ప్రేమ పేరుతో పెట్టడంతో యూత్ నుంచి మంచి అప్లాజ్  వచ్చింది.

 

- Advertisement -

2004 లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. నక్షత్ర మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజశేఖర్ సమర్పణలో… జెకె క్రియేషన్స్ బ్యానర్లో కాశిం, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతమందిస్తుండడం విశేషం. బ్లాక్ బస్టర్ గరుడ వేగ సినిమాని తన కెమెరా పనితనంతో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లి… ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న గరుడవేగ అంజి ఈ చిత్రానికి డిఓపి గా పని చేస్తున్నారు. అంజి కెమెరా వర్క్ తో ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండనుంది.

 

 

నటీనటులు

విశ్వాంత్, చిత్ర శుక్లా, దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, భాను చందర్, జ్యోతి, రాకేందు మౌళి

 

 

సాంకేతిక వర్గం

దర్శకుడు – కళ్యాణ్ జి గోగన

ప్రొడ్యూసర్ – కాశిం

కో ప్రొడ్యూసర్ – శ్రీవల్లి చైతన్య హర్ష

మ్యూజిక్ – మణిశర్మ

డిఓపి – అంజి గరుడ వేగ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All