Homeటాప్ స్టోరీస్హిందీ అర్జున్ రెడ్డి టీజర్ వచ్చేసింది

హిందీ అర్జున్ రెడ్డి టీజర్ వచ్చేసింది

టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం ” అర్జున్ రెడ్డి ” కాగా ఆ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . షాహిద్ కపూర్కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఈరోజు టీజర్ ని రిలీజ్ చేసారు సందీప్ రెడ్డి వంగా అండ్ కో .

- Advertisement -

అయితే అర్జున్ రెడ్డి ఫ్లో లోనే ఉంది ఈ టీజర్ , అయితే అర్జున్ రెడ్డి చిత్రం వచ్చి అప్పుడే మూడేళ్లు కావస్తోంది దాంతో స్క్రిప్ట్ లో ఇంకా ఏమైనా మార్పులు చేసాడో లేదంటే యాజిటీజ్ గా తీసాడో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలీదు . ఈ కబీర్ సింగ్ ని జూన్ 21న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . త్వరలోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి హిందీలో ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో తెలియాలంటే కొద్దీ రోజులు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All