Homeటాప్ స్టోరీస్ట్రెండ్ మారుతుంది. సినిమాలో పాటలు, రొమాన్స్ ఉండట్లేదు.

ట్రెండ్ మారుతుంది. సినిమాలో పాటలు, రొమాన్స్ ఉండట్లేదు.

Kaarthi's Khaidi
Kaarthi’s Khaidi

ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే హీరోయిన్స్ అందం, అభినయం ఉంటాయి అని  జనాలు థియేటర్ లకి పరుగులు తీసేవారు. ప్రత్యేకంగా చెప్పాలంటే దర్శకుడు ‘కె.రాఘవేంద్ర రావు‘ గారి సినిమాలు విడుదల అవుతున్నాయంటే హీరోయిన్స్ ని బాగా చూపిస్తారు అని నమ్మకంతో సినిమాని చూసిన వారు కూడా ఉన్నారు. అదే ట్రెండ్ ని కొంతమంది దర్శకులు కూడా ఫాలో అయ్యేవాళ్ళు.

ట్రెండ్ అంటేనే మారడం. మార్పు కోరుకోవడం. అలాంటిది ఎప్పుడూ అవే కథలు, అవే ఫార్ములా వర్క్ అవుట్ అవ్వడం అంటే కష్టం కదా. ఒక్కోసారి సినిమాలో కథ బాగుంటే, అడ్డదిడ్డమైనా పాటలు, హాస్యానికి చోటు ఉండదు. కానీ కొంతమంది దర్శకులు వాటిని సినిమాలో ఇరికించి మంచి కథ, కథనం ఉన్న సినిమాని చెడగొట్టేసారు. అలా చెడగొట్టిన  సినిమాలు దాదాపు వేల సంఖ్యలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిన సమస్య అంటే….

- Advertisement -

తమిళ సినిమా వాళ్ళు ఆ ఫార్ములాని, ట్రెండ్ ని మార్చి సినిమాలు తీసి హిట్ కొట్టేస్తున్నారు. కొన్ని సినిమాలకి పాటలు, హాస్యం, వగైరా ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి వాటి జోలికి పోకుండా సినిమాని ఆసక్తిగా మరచాలి, ఆధ్యంతం కథ ముందుకి పోవాలి అని చెప్పి సినిమాలు తీసి హిట్ కొట్టేస్తున్నారు. గత సంవత్సరం విడుడల అయిన విశాల్ ‘డిటెక్టివ్’ సినిమా చూసుకుంటే సినిమాలో ఒక్క పాట కూడా ఉండదు, అడ్డదిట్టమైన హాస్యం లాంటివి కథకి అడ్డుగా ఏమి రావు.

అందుకే సినిమా మొదటి నిమిషం దగ్గర నుండి చివరి నిమిషం వరకు చాలా ఉత్కంఠ భరితనంగా తరువాత ఎం జరుగుతుంది అని జనాలని థియేటర్ లో కూర్చునేలా చేసింది. సినిమా విజయం కూడా సాధించింది. అందుకే అదే కోవకి చెందిన ఇంకొక కథ ఇప్పుడు అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ పాటలు కానీ, రొమాన్స్ కానీ ఏం లేకుండా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయనడానికి వస్తుంది. సూర్య తమ్ముడిగా తెలుగు, తమిళ ప్రేక్షకులకి పరిచయం అయిన ‘కార్తీ‘ తదుపరి సినిమా గురించి ఇప్పుడు ఆసక్తి పెరిగింది అందరిలో.

‘లోకేష్ కనగరాజ్’ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, తిరుప్పూర్ వివేక్ నిర్మాతలుగా కార్తీ నటిస్తున్న సినిమా ‘ఖైదీ‘ విడుదలకి సిద్ధం అవుతుంది. సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఖైదీ సినిమాలో కూడా పాటలు, రొమాన్స్ ఏమి ఉండవు, ఓన్లీ యాక్షన్ మాత్రమే ఉంటుంది అని కార్తీ గారు ట్వీట్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే కూడా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నారు అందరు. దీపావళికి విడుదల అవుతున్న సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All