
యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం)”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఈ తరుణంలోనే సినిమా పలు రికార్డ్స్ సృష్టిస్తుంది. రిలీజ్ ముందే ఏదోక రికార్డు నెలకొల్పుతుంటే..రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అంత ఆశ్చర్య పోతున్నారు.
ఇదిలా ఉంటె తాజాగా కెనడాలో కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా వినూత్నంగా సినిమా పేరును హైలెట్ చేస్తున్నారు. ఒక పార్కింగ్ ఏరియా లో ఖరీదైన కార్లు ఆర్ఆర్ఆర్ ఆకారంలో పార్క్ చేసి చూపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పేరును కూడా చూపించడం విశేషం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టైటిల్ పాటు తొక్కుకుంటూ పోవాలే అనే ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Sky is the limit they said… But is it ?? #RRRMassBegins #RRRMovie ??
— RRR Movie (@RRRMovie) March 12, 2022
#RRRMassBegins … ????
Canada fans, thanks for your love and unmatchable efforts to make this !! ❤️ #RRRMovie
— RRR Movie (@RRRMovie) March 12, 2022