Homeటాప్ స్టోరీస్జోర్దా‌ర్ సుజాత బిగ్‌బాస్ సీక్రెట్ చెప్పేసింది!

జోర్దా‌ర్ సుజాత బిగ్‌బాస్ సీక్రెట్ చెప్పేసింది!

జోర్దా‌ర్ సుజాత బిగ్‌బాస్ సీక్రెట్ చెప్పేసింది!
జోర్దా‌ర్ సుజాత బిగ్‌బాస్ సీక్రెట్ చెప్పేసింది!

బిగ్బాస్ సీజ‌న్ 4 ఇటీవ‌లే మొద‌లైన విష‌యం తెలిసిందే. నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ రియాలిటీ షో మొద‌ట్లో కొంత డివైడ్ టాక్‌ని ద‌క్కించుకున్నా షో సాగుతున్న కొద్దీ ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టి వ‌రకు ఈ షో నుంచి సూర్య‌కిర‌ణ్‌, క‌రాటే క‌ల్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్ అనూహ్యంగా బ‌య‌టికి వ‌చ్చేశారు.

ఇక అనారోగ్య కార‌ణాల వ‌ల్ల యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. తాజాగా టాస్క్‌లో ఓట‌మి పాలైన జోర్దార్ సుజాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. సుజాత‌ది ఫేక్ న‌వ్వంటూ చాలా మంది ఆమెని ఎలిమినేట్ అయ్యేలా చేశారు. ఆమె భ‌విష్య‌త్‌పై భారీ బండ వేశారు. ఇదిలా వుంటే ఈ షోలో నాగ్ క‌నిపించిన ప్ర‌తీసారి జోర్దార్ సుజాత `బిట్టూ ` అంటే నాగ్‌ని పిల‌వ‌డం తెలిసిందే.

- Advertisement -

ఏంటీ సుజాత్ అలా నాగ్‌ని పిల‌వ‌డం ఓవ‌ర్‌గా వుందే అని అనుకున్న వాళ్లూ చాలా మందే వున్నారు. కానీ అలా పిల‌వ‌డం వెన‌క షాకింగ్ విష‌యం వుంద‌ని ఇటీవ‌ల సుజాత ఆ సీక్రెట్‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. నాగ్‌ని `బిట్టు` అని పిల‌వాల‌ని, అలా బిగ్‌బాస్ టీమ్ సూచించింద‌ట‌. వారి సూచ‌న మేర‌కే తాను బిట్టు అని నాగ్ స‌ర్‌ని పిలిచాన‌ని, త‌ను అలా పిల‌వ‌డం నాగ్‌స‌ర్‌కి కూడా న‌చ్చింది కాబ‌ట్టే ఆయ‌న ఎలాంటి ఆబ్జెక్ష‌న్ చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. `మ‌నం` చిత్రంలో నాగ్ పేరు బిట్టు అన్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All