Homeటాప్ స్టోరీస్కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన JGM టీం

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన JGM టీం

JGM Team meets honorable Defence minister rajnath singh
JGM Team meets honorable Defence minister rajnath singh

జనగణమన టీం బుధువారం సాయంత్రం ఢిల్లీ లో రాజ్‌నాథ్ సింగ్ ను కలిశారు. నిన్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ‘జేజీఎం’ (జన గణ మన) చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ‘లైగర్’ చిత్ర హీరో విజయ్ దేవరకొండతోనే ఈ చిత్రాన్ని ఆయన చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పూరీ ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు.

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలెందరినో ఈ ప్రాజెక్ట్‌కి పూరి సంప్రదించారు. ఫైనల్‌గా విజయ్‌తోనే ఈ చిత్రాన్ని పూరీ తెరకెక్కించబోతున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకోనున్న ఈఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్ 3న రిలీజ్ చెయ్యబోతున్నట్టు కూడా అనౌన్స్ చేసేశారు. ఈ తరుణంలో బుధువారం సాయంత్రం చిత్ర యూనిట్ రాజ్‌నాథ్ సింగ్ ను కలిసి సినిమా విశేషాలు పంచుకున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All