Homeటాప్ స్టోరీస్జెర్సీ రివ్యూ

జెర్సీ రివ్యూ

జెర్సీ రివ్యూ
నటీనటులు : నాని , శ్రద్దా శ్రీనాథ్ , సత్యరాజ్
సంగీతం : అనిరుధ్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
రేటింగ్ : 3. / 5
రిలీజ్ డేట్ : 19 ఏప్రిల్ 2019

- Advertisement -

 

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ” జెర్సీ ”. సక్సెస్ లో లేని నాని జెర్సీ తో మళ్ళీ హిట్ కొట్టాడా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

 

కథ :

క్రికెట్ అంటే పడిచచ్చే అర్జున్ ( నాని ) పెళ్లి చేసుకున్నాక క్రికెట్ కు దూరం కావాల్సి వస్తుంది . సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతున్న అర్జున్ కు పదేళ్ల తర్వాత తన కల అయిన క్రికెట్ పై మనసు మళ్లుతుంది . తన లక్ష్యం కోసం మళ్ళీ బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి అడుగుపెడతాడు . అయితే వయసు మీద పడిన వయసులో అర్జున్ తన లక్ష్యం అందుకున్నాడా ? ఆ లక్ష్య సాధనలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

నాని నటన
శ్రద్దా శ్రీనాథ్ గ్లామర్ ప్లస్ యాక్టింగ్
నేపథ్య సంగీతం
ఎమోషనల్ సీన్స్
డైరెక్షన్

డ్రా బ్యాక్స్ :

సినిమా నిడివి

నటీనటుల ప్రతిభ :

న్యాచురల్ స్టార్ నాని తన బిరుదు కి మరోసారి పరిపూర్ణ న్యాయం చేసాడు . అర్జున్ పాత్రలో నాని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంత గొప్పగా నటించాడు . లవర్ గా క్రికెటర్ గా అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఇలా ఎలా చూసుకున్నా అద్భుతంగా నటించి తన కెరీర్ లోనే జెర్సీ ని మైలురాయిగా చేసుకున్నాడు . కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ కూడా అద్భుతంగా నటించింది . ప్రేయసి గా గ్లామర్ ని ఒలికించి , భార్యగా , తల్లిగా విభిన్నత ని చూపించి భేష్ అనిపించింది . నాని కొడుకుగా నటించిన రోహిత్ కామ్రా కూడా చాలా బాగా నటించాడు . క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ కూడా నాని గురువుగా మరో కీలక పాత్రలో మెప్పించాడు .

 

సాంకేతిక వర్గం :

దర్శకులు గౌతమ్ తిన్ననూరి విషయానికి వస్తే ….. జెర్సీ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దాడు అని చెప్పడంలో సందేహం లేదు . ఫ్యామిలీ ఎమోషన్స్ ని అద్భుతంగా చిత్రీకరించాడు గౌతమ్ . నాని , శ్రద్దా శ్రీనాథ్ , రోహిత్ , సత్యరాజ్ ల నుండి అద్భుత నటన ని రాబట్టుకొని తనదైన ముద్ర వేసాడు . మళ్ళీ రావా చిత్రంతో పరిచయమైన గౌతమ్ జెర్సీ తో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు . సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మేకర్ గా మరోసారి తన అభిరుచి నిరూపించుకున్నాడు . అనిరుద్ అందించిన పాటలు బాగున్నాయి అంతకంటే నేపథ్య సంగీతం మరింత హైలెట్ గా నిలిచింది . షాను విజువల్స్ అద్భుతం .

 

ఓవరాల్ గా :

ఇంటిల్లిపాదికి నచ్చే సినిమా

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All