
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ మూవీ ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు.
గతంలో రామ్‌చరణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, నాని రిలీజ్ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రాగా..రేపు పవన్ విడుదల చేసే ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా..అనూష్ కుమార్ కెమెరా వర్క్ చేసారు. ఇక విజయలక్ష్మి సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమాకు అమర్-అఖిల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవరించారు.