Homeటాప్ స్టోరీస్ఆ బయోపిక్ ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో

ఆ బయోపిక్ ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో

Jayalalitha Controversy biopic on cardsదేశ వ్యాప్తంగా అన్ని చిత్రరంగాల్లో బయోపిక్ ల హవా నడుస్తోంది , బయోపిక్ లు బ్లాక్ బస్టర్ లు అవుతుండటంతో పాటు డబ్బుకి డబ్బు , గౌరవానికి గౌరవం కూడా లభిస్తుండటంతో బయోపిక్ ల నిర్మాణానికి పలువురు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు . ఇప్పటికే పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ కాగా మరికొన్ని చిత్రాలు నిర్మాణదశలో ఉన్నాయి . కాగా తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కూడా తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఈ బయోపిక్ ఎన్ని వివాదాలు రాజేస్తుందో అన్న అనుమానం ఉంది .

ఎందుకంటే జయలలిత బయోపిక్ అంటే ఎం జి ఆర్ , కరుణానిధి ,శశికళ లతో పాటుగా శోభన్ బాబు ప్రస్తావన కూడా ఉండాలి . హీరో శోభన్ బాబు ప్రస్తావన ఉంటే వివాదం రేగడం ఖాయం , అలాగే కరుణానిధి ప్రస్తావన తప్పకుండా ఉండాల్సిందే . ఆయన ప్రస్తావన ఉంటే అతడ్ని కించపరిచేలా సన్నివేశాలు ఉంటే తమిళనాట కొంతమంది ప్రజలు , డీఎంకే కార్యకర్తలు సహించరు దాంతో వివాదాలు రేగడం ఖాయం . అయినప్పటికీ ఇన్ని అవాంతరాలు వస్తాయని తెలిసినప్పటికీ ఏ ఎల్ విజయ్ జయలలిత బయోపిక్ తెరకెక్కించడానికి ముందుకు వచ్చాడు . సినిమా విడుదల అయితే కానీ తెలీదు ఎలాంటి వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముడుతాయో !

- Advertisement -

English Title: Jayalalitha Controversy biopic on cards

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All