
దివంగత నటుడు, కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఓటిటి లో రిలీజ్ కు సిద్ధమైంది. పునీత్ జయంతి (మార్చి 17) సందర్భంగా జెమ్స్ మూవీ థియేటర్స్ లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అప్పు ఫ్యాన్స్ థియేటర్లకు పొటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే థియేటర్లకు క్యూ కట్టి , సినిమాను పెద్ద విజయం చేసారు.
పునీత్ ను చివరి సారిగా తెరపై చూసి కన్నీటి పర్యంతం అయ్యారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 14 నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29 న గుండెపోటు తో మరణించారు. జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెనొప్పి రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసారు.
కొన్ని నిమిషాల క్రితమే పునీత్ రాజ్ కుమార్ చనిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. రాజ్ కుమార్ చిన్న కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్, చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ ఏడాది యువరత్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.