Homeటాప్ స్టోరీస్సుక్కు మ‌ళ్లీ జ‌గ్గూభాయ్‌ని దింపేస్తున్నాడా?

సుక్కు మ‌ళ్లీ జ‌గ్గూభాయ్‌ని దింపేస్తున్నాడా?

Jagapathi babu palying villain role in pushpa
Jagapathi babu palying villain role in pushpa

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ ‌చ‌ర‌న్ హీరోగా న‌టించిన చిత్రం `రంగ‌స్థ‌లం`. ఇందులో చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్ అభిన‌యం విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపించింది. ఇదే చిత్రంలో జ‌గ్గూ భాయ్ జ‌గ‌ప‌తిబాబు ఊరి స‌ర్పంచ్‌గా ఫ‌ణీంద్ర భూప‌తి పాత్ర‌లో న‌టించిన ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. మ‌రో సారి జ‌గ‌ప‌తిబాబుని విల‌క్ష‌ణ‌మైన పాత్ర కోసం సుకుమార్ ఎంపిక చేసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్  హీరోగా న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్ప‌`. ముత్యం శెట్టి మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ చేసే యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. స్లైలిష్ పాత్ర‌ల్లో ఇంత వ‌ర‌కు మెరిసిన బ‌న్నీ ఈ చిత్రంలో తొలి సారి మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -

ఇందులో కీల‌కమైన విల‌న్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు న‌టిస్తార‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబుని తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిందే.  ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్త‌యిన ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని త్వ‌ర‌లోనే ప్రారంభించాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All