Homeటాప్ స్టోరీస్గూఢచారి సక్సెస్ మీట్ లో ఘనంగా జగపతి బాబు 30 ఇయర్స్ సెలెబ్రేషన్స్

గూఢచారి సక్సెస్ మీట్ లో ఘనంగా జగపతి బాబు 30 ఇయర్స్ సెలెబ్రేషన్స్

Jagapathi Babu's 30th Years Celebrations in the Goodachari Success Meetఅడవి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ గూఢచారి‘.. శిభిత ధూళిపాళ హీరోయిన్.. అలనాటి హీరోయిన్ సుప్రియ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. టీజర్ , ట్రైలర్ లతో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన తొలి రోజునుంచే మంచి వసూళ్లను రాబట్టుకుని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.. కాగా ఈ చిత్రానికి సంబంధించిన థాంక్స్ మీట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ఈ కారక్రమానికి జగపతి బాబు ముఖ్య అతిధిగా హాజరు కాగా అయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 30 సంవత్సరాలయ్యింది.. ఈ సందర్భంగా ఆ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది..

ఈ సందర్భంగా నటుడు జగపతి బాబు మాట్లాడుతూ… గూఢచారి సినిమా నాకెంతో స్పెషల్ ఎందుకంటే నా 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది గూఢచారి తోనే.. ఇంతకంటే ఎం కావలి నాకు.. ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న నాకు 30 ఏళ్ళు సినిమాలు చేసే అవకాశం కల్పించారు.. అందరికి నా స్పెషల్ థాంక్స్ అన్నారు.. చిరంజీవి గారి క్లాప్ తో మొదలైన నా ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది.. అందరి లాగ నేను కూడా ఓ స్టార్ అవబోతున్నానని అప్పుడు అనిపించింది. కానీ వరుసగా 10 ఫ్లాప్ ల తర్వాత కూడా నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.. ఇక ఈ గూఢచారి థాంక్స్ మీట్ ఫంక్షన్ ని నా కోసం చేసారంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. సినిమా గురించి చెప్పాలంటే టీం అంతా చాల బాగా చేసారు..ఏ ఫెసిలిటీ లేకుండా ఈ సినిమాకి అందరు టెక్నిషియన్స్ చాల బాగా పనిచేశారు. నా 30 ఇయర్స్ ని ఇంత బాగా సెలెబ్రేట్ చేసినందుకు అందరికి నా ధన్యవాదాలు అన్నారు.

- Advertisement -

హీరో అడివి శేష్ మాట్లాడుతూ “ఈ సినిమా నిర్మాతలకి చాలా థాంక్స్ . మమ్మలిని నమ్మినా అభిషేక్ నామా గారికి థాంక్స్. అలాగే మా గూఢచారి ద్వారా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగపతి బాబు గారికి స్పెషల్ థాంక్స్. ఒక అద్భుతమైన నటుడు. మేము రాసుకున్న రోల్ ఎవరు చేస్తారు అనుకోలేదు. కానీ జగపతి బాబు చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. మా టీంకి ఇంకా మా ఆర్టిస్ట్స్ అందరికి థాంక్స్.”

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. జగపతి బాబు గారికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ సినిమాలో జగపతి బాబు గారు కనపడగానే ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంతా కాదు.. ఈ సినిమా విజయం వెనుక ఈ సినిమా టీం ఉంది.. ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే వారే కారణం.. ఈ సినిమా లో నాకు వారి పని కనిపించింది.. వారికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా..

రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. నేను లైఫ్ లో మర్చిపోలేని సినిమా గాయం 2 ..జగపతి బాబు గారి గొంతంటే నాకిష్టం.. మీ తో కలిసి ఇప్పుడు పనిచేయడం చాల ఆనందంగా ఉంది.. ఎంత గొప్ప కథ ఇచ్చిన దానికి మించిన విసువల్ స్క్రీన్ మీద ఉండాలి అది శశి చాల బాగా చేసాడు.. సినిమా హిట్ అయ్యినందుకు చాల హ్యాపీ గా ఉంది.. అన్నారు.

దర్శకుడు శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ.. ముందుగా జగపతి బాబు గారిని ఈ సినిమాకి అనుకున్నప్పుడు ఇంత మంచి మనిషిని ఈ రోల్ లో ఎలా చూపించాలి అని అనుకున్నాను.. కానీ ఏ రోల్ అంటే ఆ రోల్ కి వెళ్లి చేసే గొప్ప నటుడు అన్నారు… ఆయనతో చాల కంఫర్ట్ గా షూటింగ్ చేయవచ్చు.. అన్నారు.

వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ.. ఒక ప్లాన్ ప్రకారం జగపతి బాబు గారిని ఈ సినిమాలో ఇంతవరకు రివీల్ చేయలేదు.. అందుకే ఈ సక్సెస్ మీట్ ద్వారా ఆయనకు 30 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలనుకున్నాము.. సినిమా హిట్ అయినందుకు చాల హ్యాపీగా ఉన్నాము.. ఓవర్సీస్ లో మేమె ఈ సినిమాను రిలీజ్ చేసాము.. మొదటి రెండు రోజులకన్నా నిన్న మొన్నా కలెక్షన్స్ బాగున్నాయి.. సినిమా విజయం వెనకనున్న అందరికి నా థాంక్స్ అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All