Homeటాప్ స్టోరీస్జాను రివ్యూ

జాను రివ్యూ

Jaanu Movie Review in Telugu
జాను రివ్యూ

జాను మూవీ రివ్యూ
నటీనటులు:
శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: సి ప్రేమ్ కుమార్
నిర్మాత: దిల్ రాజు
సంగీతం: గోవింద్ వసంత
విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2020
రేటింగ్: 3.25/5

శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను చిత్రం మొదటి నుండి ఆసక్తిని రేకెత్తించింది. తమిళంలో క్లాసికల్ హిట్ గా నిలిచిన 96 చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:
రామ్ (శర్వానంద్) వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. వివిధ ప్రదేశాలు తిరుగుతూ అక్కడి ప్రకృతి అందాల్ని క్యాప్చర్ చేస్తుంటాడు. తన జర్నీలో భాగంగా తను పుట్టిన ఊరికి వెళ్లిన రామ్, తను చదువుకున్న స్కూల్ కు కూడా వెళతాడు. అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్కూల్ రీ యూనియన్ కు తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేస్తాడు. అయితే తనకు తెలియని విషయమేమిటంటే ఆ స్కూల్ రీ యూనియన్ కు జాను (సమంత) కూడా వస్తోంది.

- Advertisement -

17 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించుకుని ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. 17 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో కలిశారు? కలిసాక ఏం జరిగింది? వంటి విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:
శర్వానంద్ కు ఇదే బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు. రామ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తన గుండెల్లోని బాధను, జాను ని చూసినప్పుడు కలిగిన ఉద్వేగాన్ని కలగలిపి చూపించాల్సిన సీన్ లో శర్వానంద్ నటనను మెచ్చుకోకుండా ఉండలేం. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో కూడా శర్వానంద్ నటన మెప్పిస్తుంది. సమంత ఈ చిత్రాన్ని ఓన్ చేసుకున్న తీరుకు ఫిదా అయిపోతాం. తన రామ్ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అని తెలిసిన సీన్ కు సమంత యాక్టింగ్ ను చూసి మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. ముఖ్యంగా ఇద్దరూ కలిసి క్లైమాక్స్ లో మన గుండెను తడి చేస్తారు. అంత చక్కగా నటించారు. ఇక శర్వానంద్, సమంత చిన్నప్పటి క్యారెక్టర్ లు వేసిన గౌరి, సాయి కిరణ్ లు కూడా భలే నటించారు. ఆ ఫీల్ ను క్యారీ చేయడంలో విజయవంతమయ్యారు. ఇక వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విలువలు:
గోవింద్ వసంత అందించిన సంగీతం, నేపధ్య సంగీతం రెండూ కూడా సినిమా ఫీల్ ను ముందు క్యారీ చేస్తాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఇక నేపధ్య సంగీతం ఎమోషన్స్ ను పతాక స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఉపయోగపడింది. సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. డైలాగులు ఇంకా బెటర్ గా ఉండొచ్చన్న ఫీలింగ్ కలిగింది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా కొంచెం స్లో అనిపించినా కథకు అది అవసరమే అనిపిస్తుంది. ఇక సి ప్రేమ్ కుమార్ తీసుకున్న పాయింట్ అందరి జీవితాల్లోనూ జరిగేదే. స్కూల్ డేస్ లో ఆ స్వచ్ఛమైన, అమాయకపు ప్రేమను ప్రతి ఒక్కరూ చవిచూసే ఉంటారు. ఇలాంటి ఒక పాయింట్ ను తీసుకుని ఎమోషనల్ గా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ:
రీమేక్ కాబట్టి ఎంత కాదనుకున్నా ఒరిజినల్ తో పోలికలు పెట్టడం సహజం. 96′ తమిళంలో కల్ట్ స్టేటస్ సంపాదించుకున్న సినిమా. అలాంటి సినిమాను అటెంప్ట్ చేయడమే రిస్క్. అయితే ఇక్కడ దిల్ రాజు ఆల్మోస్ట్ అదే టీమ్ ను హీరో, హీరోయిన్ ను మార్చి తెరకెక్కించి సేఫ్ గేమ్ ప్లే చేసారు. వారందరూ కలిసి మ్యాజిక్ తిరిగి క్రియేట్ చేయడానికి కష్టపడ్డారు. మ్యాజిక్ అనేది ఒక్కసారే అవుతుంది. ప్రతిసారీ వర్కౌట్ అవ్వదు. అలా అని జాను బాలేదని కాదు. 96 చూడని వాళ్లకు కచ్చితంగా నచ్చే సినిమా జాను.

సమంత, శర్వానంద్ ల పెర్ఫార్మన్స్ ల కోసమే ఒకసారి చూసేయొచ్చు. ఇక మిగతావన్నీ బోనస్. ఇంత ప్యూర్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉండరు.

Jaanu Movie Review in English

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All