Homeటాప్ స్టోరీస్ఇస్మార్ట్ బ్యూటీ సారీలో జిగేల్‌

ఇస్మార్ట్ బ్యూటీ సారీలో జిగేల్‌

ఇస్మార్ట్ బ్యూటీ సారీలో జిగేల్‌
ఇస్మార్ట్ బ్యూటీ సారీలో జిగేల్‌

నిధి అగ‌ర్వాల్‌.. ప‌క్కా హైద‌రాబాద్‌. అగ‌ర్వాల్ ఫ్యామిలీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `మున్నా మైఖేల్` తో సినీరంగ ప్ర‌వేశం చేసింది. టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించినా ఈ అమ్మ‌డి చూపు టాలీవుడ్‌పై వుండ‌టంతో ఇక్క‌డ ట్రై చేయ‌డం మొద‌లుపెట్టింది. `స‌వ్య‌సాచి`తో తెలుగులో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నించింది.

కానీ ఫ్లాప్ కావ‌డంతో కొంత నిరాశంకు గురైంది. ఆ త‌రువాత చేసిన `మిస్ట‌ర్ మ‌జ్ను` కూడా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో పూరిని న‌మ్మ‌కుంది. రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ చేసిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం నిధి తెలుగులో ఒకే ఒక్క చిత్రంలో న‌టిస్తోంది. మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు, గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

నిత్యం సోష‌ల్ మీడియాలో సెక్సీ పిక్స్‌తో ఆక‌ట్టుకుంఉన్న నిధి అగ‌ర్వాల్ తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. సారీలో హొయ‌లొలికిస్తూ వ‌య్యారాలు పోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి.  నిధి సాధారణంగా వెస్ట్ర‌న్ ఔట్ ఫిట్‌ల‌లో కనిపిస్తుంది.. కానీ తాజాగా చీరలో క‌నిపించింది. ఈ ఫోటో షూట్‌లో ఆమె సున్నితమైన మరియు సెక్సీగా కనిపిస్తోంది. బహుశా, నిధి దర్శకులు మరియు రచయితలకు ఆమె తెలియని వైపు చూపించడానికి అవకాశం ఇచ్చే పాత్రలతో ముందుకు రావాలని సందేశం పంపుతున్న‌ట్టుగా వుంది. నిధి ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలలో ఒక్కొక్క సినిమా చేస్తున్నారు.‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All