Homeటాప్ స్టోరీస్ఆ స్టార్ హీరో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడా ?

ఆ స్టార్ హీరో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడా ?

Is vishal facing financial problemతెలుగు , తమిళ భాషల్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న హీరో విశాల్ .అయితే ప్రస్తుతం వినబడుతున్న కథనాల ప్రకారం హీరో విశాల్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోకు ఆర్ధిక ఇబ్బందులు ఏంటి ? అని అనుకుంటున్నారా ? విశాల్ స్టార్ హీరో అయినప్పటికీ ఎక్కువగా చేసిన చిత్రాలన్నీ సొంత చిత్రాలే అందులో ఎక్కువగా ప్లాప్ చిత్రాలే దాంతో ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తోంది. విశాల్ నిర్మించిన చిత్రాల బడ్జెట్ ఎక్కువ కావడం ఆ స్థాయిలో వసూళ్లు రాకపోవడం, ఒకవేళ డబ్బులు వచ్చినా మరో సినిమాలో పెట్టుబడి పెట్టడం లాంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఈ సమస్య వచ్చినట్లుంది.

కామన్ గా సినిమారంగంలో ఫైనాన్షియర్ ల దగ్గర అప్పు తీసుకుని సినిమా చేస్తారు , అలాగే ఈ హీరో కూడా చేసాడు కానీ రొటేషన్ లో కాస్త ఇబ్బంది ఎదురయ్యిందట . విశాల్ బయటి సినిమాలు తక్కువగా చేసాడు సొంత సినిమాలు ఎక్కువగా చేసాడు. ఇటీవల అభిమన్యుడు చిత్రంతో హిట్ కొట్టిన విశాల్ తాజాగా పందెం కోడి 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . పందెం కోడి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్ కూడా ఆ స్థాయి హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. పైగా పందెం కోడి 2 విశాల్ కు 25 వ సినిమా కావడం విశేషం.

- Advertisement -

English Title: Is vishal facing financial problem

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All