Homeగాసిప్స్సైరా ఈవెంట్ కు రజనీకాంత్ రానున్నాడా ?

సైరా ఈవెంట్ కు రజనీకాంత్ రానున్నాడా ?

Rajinikanth  Chief Guest for Sye Raa Narasimha Reddy
Rajinikanth Chief Guest for Sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి , రజనీకాంత్ లు కలిసి ఒక సినిమాలో నటించారు కూడా , ఇక తెలుగులో చిరంజీవి నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో తమిళంలో రజనీకాంత్ నెంబర్ వన్ గా కొనసాగాడు.

దాంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఆ స్నేహం తో సైరా వేడుకకు రజనీకాంత్ ని పిలవాలని అనుకున్నాడట చిరు. సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు దాంతో ఈ సినిమాపై తెలుగునాట భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

అమితాబ్ బచ్చన్ అథితి పాత్ర పోషించడంతో సైరా చిత్రానికి జాతీయ స్థాయిలో కూడా మంచి ఊపొస్తొంది. సెప్టెంబర్ నెలాఖరున భారీ ఎత్తున సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు కాగా ఆ ఈవెంట్ కు రజనీకాంత్ హాజరైతే మెగా ఫ్యాన్స్ కు మరింత కిక్ రావడం ఖాయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All