Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటిస్తోందా ?

ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటిస్తోందా ?

is-laya-in-part-of-ntr-trivikrams-filmయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ప్రారంభోత్సవం జరిగి మూడు నెలలు అవుతున్నప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది . ప్రస్తుతం ఎన్టీఆర్ తన దృష్టి అంతా మేకోవర్ పై పెట్టాడు . ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అంటే ఎవరో ఒకరు సీనియర్ హీరోయిన్ కీలక పాత్ర పోషించడం కామన్ అయిపొయింది , ఇంతకుముందు అత్తారింటికి దారేది చిత్రంలో నదియా ని , అజ్ఞాత వాసి చిత్రంలో కుష్భు ని కీలక పాత్రల్లో నటింప జేసినట్లు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఒక మాజీ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది .

తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి లయ ని మళ్ళీ వెండితెర మీదకు తీసుకురావాలని త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడట . సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని హాయిగా విదేశాల్లో సెటిలైంది . అయితే మళ్ళీ ఎన్టీఆర్ సినిమా కోసం లయ ని త్రివిక్రమ్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి . లయ మొదటి సినిమా స్వయం వరం కాగా ఆ సినిమాకు రచనా సహకారం అందించాడు త్రివిక్రమ్ అలా లయ తో మంచి అనుబంధం ఉంది త్రివిక్రమ్ కు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All