Homeటాప్ స్టోరీస్ఈ భామ నటించిన సినిమాలన్నీ ఫ్లాపే !

ఈ భామ నటించిన సినిమాలన్నీ ఫ్లాపే !

iron leg pooja hegde పూజా హెగ్డే నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి ఇంతవరకు . హిందీలో మొహంజదారో చిత్రంలో నటించగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది . ఇక తెలుగులో చేసిన ముకుంద సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది . దాని కంటే ముందే ఒక లైలా కోసం అనే సినిమా వచ్చింది అది కూడా అంతగా ఆడలేదు . అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం అనే చిత్రంలో నటించింది ఇది కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ భారీ వసూళ్లు అయితే సాధించింది . సాక్ష్యం సినిమా డిజాస్టర్ , ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటించింది . ఈ సినిమాకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి కానీ తెలంగాణాలో మాత్రమే ఇది సూపర్ హిట్ అయ్యింది ఎందుకంటే దిల్ రాజు కు లాభాలు వచ్చాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా బయ్యర్లకు పెట్టిన పెట్టుబడి రాలేదు .

ఓవర్ సీస్ లో నష్టాలు వచ్చాయి . ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ లో మాత్రం ఈ భామ ఉంది కాకపోతే అందులో హీరోయిన్ కాదు సుమా ! జస్ట్ ఐటెం సాంగ్ చేసింది అదే రంగస్థలం చిత్రంలో . ఇక ఇప్పుడేమో మహేష్ బాబు తో మహర్షి అనే సినిమాలో నటిస్తోంది అలాగే ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేస్తోంది . పాపం ! పూజా హెగ్డే ఇప్పటివరకు చేసిన టాలీవుడ్ సినిమాలలో ఒక్క రంగస్థలం తప్ప మిగతావి అంతగా సాలిడ్ హిట్స్ కాదు . అరవింద సమేత నిర్మాతలకు లాభాలు వచ్చినప్పటికీ బయ్యర్లు మాత్రం ఇంకా సేఫ్ జోన్ లోకి వెళ్ళలేదు . దాంతో పూజా హెగ్డే కూడా ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటోంది .

- Advertisement -

English Title: iron leg pooja hegde

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All