Homeటాప్ స్టోరీస్లాయర్ సాబ్ గా బాలయ్య ?

లాయర్ సాబ్ గా బాలయ్య ?

Intresting Title for Nandamuri Balakrishna
Intresting Title for Nandamuri Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ ” లాయర్ సాబ్ ” గా కనిపించనున్నట్లు తెలుస్తోంది . బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో లాయర్ సాబ్ గా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆ సినిమాలో కీలక పాత్రలో బాలయ్య ని నటింప జేయాలని చూస్తున్నారట . ఇంకా ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు కానీ ప్రస్తుతం చర్చల దశలో అయితే ఉంది .

అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇప్పటివరకు దిల్ రాజు బాలయ్య తో సినిమా చేయలేదు దాంతో ఎలాగైనా సరే బాలయ్య బాబుతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట . బాలయ్య ఒప్పుకుంటే ” లాయర్ సాబ్ ” అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలనీ నిర్ణయించుకొన్నాడట . ప్రస్తుతం బాలయ్య తమిళ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు , ఇది కాకముందే లాయర్ సాబ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All