Homeటాప్ స్టోరీస్ఏప్రిల్ 6న నందు “ఇంతలో ఎన్నెన్ని వింతలో “విడుదల

ఏప్రిల్ 6న నందు “ఇంతలో ఎన్నెన్ని వింతలో “విడుదల

inthalo-yennenni-vinthalo-get-release-dateనందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహిస్తున్నారు.
నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న ఈ చిత్రం విడుదల సందర్బగా నిర్మాత ఇప్పిలి రామమోహన రావు మాట్లాడుతూ…
యాజమాన్య సంగీతం లో ఇటీవలే విడుదలైన మా ఆడియో లో సురేష్ ఉపాధ్యాయ రాసిన ఎన్నో రంగుల్లో ముంచేస్తుందే ఈ సమయం…. అనే పాటకు యు ట్యూబ్ లో 13 లక్షలకు పైగా వీక్షకులను ఆకట్టుకుంది, మా చిన్న చిత్రానికి ఇంత స్పందన రావడం ఆనందంగా ఉందని తెలియపరుస్తూ, మా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని తెలియపరిచారు.

 

- Advertisement -

నల్లవేణు, దువ్వాసి మోహన్, నరసింహా, కృష్ణ తేజ, త్రిశూల్, గగన్ విహారి, రమేష్, భార్గవ్, కిషోర్ దాస్, సత్తన్న, దుర్గారావు, మీనా వాసుదేవ్, కౌశిక్, పద్మ జయంతి, సోనక్షీ వర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత – డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరామెన్ – ఎస్ మురళీ మోహన్ రెడ్డి, ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్, సంగీతం – యాజమాన్య, ఆర్ట్ – జిల్ల మోహన్, స్టంట్స్ – మర్సాల్ రమణ, కొరియోగ్రఫీ – విఘ్నేశ్వర్, సాహిత్యం – సురేష్ ఉపాధ్యాయ, పి.ఆర్.ఓ. రాంబాబు కడలి,కో డైరక్టర్ – రామ్ ప్రసాద్ గొల్లపల్లి,రచనా సహకారం, శివ యుద్ధనపూడి

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All