
వరస ప్లాపులతో పూర్తిగా డీలా పడ్డ నితిన్ ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి కసి మీద ఉన్నాడు. అందుకోసమే వరసగా మూడు సినిమాలను సెట్ చేసాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రం చేస్తున్న నితిన్ దీని తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రం చేయాల్సి ఉంది. భీష్మ క్రిస్మస్ సమయంలో విడుదలయ్యే అవకాశముంది.
ఈ రెండూ కాకుండా నితిన్ మూడో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమాకు సంతకం చేసాడు నితిన్. ఈ చిత్రానికి మిస్ తెలంగాణగా ఎంపికైన సిమ్రాన్ చౌదరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం చదరంగం కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని రూపొందించనున్నారట.
అందుకని ఈ చిత్రానికి చదరంగం అనే టైటిల్ నే ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. సస్పెన్స్, మిస్టరీ జోనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. నవంబర్ లో ఈ సినిమా ముహూర్తం ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి.