Homeటాప్ స్టోరీస్గోవా బ్యూటీకి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్!

గోవా బ్యూటీకి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్!

గోవా బ్యూటీకి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్!
గోవా బ్యూటీకి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్!

గోవా బ్యూటీ ఇలియానా కు మళ్ళీ టాలీవుడ్ బంపర్ ఆఫర్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఇలియానా కొన్ని రోజులు అతనితో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. ఆ తరువాత సినిమాలకు దూరంగా వున్న ఇలియానా మళ్ళీ స్పీడ్ పెంచాలని ప్లాన్  లు వేస్తోంది.

తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ ‘ తో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఇలియానాకు టాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ లభించినట్టు తెలిసింది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు ఓ యాక్షన్ థ్రిలర్ ని ప్లాన్ చేస్తున్నాడు.
సునీల్ నారంగ్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి . విశ్వ ప్రసాద్ నిర్మించడానికి ప్లాన్  చేస్తున్నారు. ఇందులో నాగార్జునకు జోడి గా ఇలియానాని దర్శకుడు ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హిట్ చిత్రం ‘రైడ్ ‘ ఆధారంగా ఈచిత్రం తెరపైకి రానున్నట్టు తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All