Homeటాప్ స్టోరీస్ఏ ఆర్ రెహమాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

ఏ ఆర్ రెహమాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

I had suicidal thoughts says ar rahmanఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్ . ఇప్పుడంటే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి , శక్తి రెహమాన్ కానీ రోజా సినిమాకు ముందు ఎన్నో కష్టాలు పడ్డాడు . రెహమాన్ కుటుంబం యావత్తు కటిక దరిద్రం అనుభవించింది , ఆర్ధిక కష్టాలు అనుభవిస్తూ సరైన తిండి లేక కుటుంబం మొత్తం పడుతున్న ఇబ్బందులు చూసి చాలాసార్లు చనిపోవాలని అనుకున్నాడట ! అంతేకాదు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడట ! అయితే చివరి నిమిషంలో ఎందుకో అది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది సరిగ్గా అదే సమయంలో తన పేరుని మార్చుకున్నాడు .

రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ అయితే ఆ పేరు అంటే అస్సలు గిట్టేది కాదట ! ఎలాగైనా సరే పేరు మార్చుకోవాలని డిసైడ్ అయి కుటుంబం మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించారు . దాంతో దిలీప్ కుమార్ కాస్త రెహమాన్ అయ్యాడు . రోజా విడుదల అయ్యింది దేశ వ్యాప్తంగా రెహమాన్ పేరు మారుమ్రోగింది . అయితే ఈరోజు నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఈస్థాయిలో ఉన్నాను కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం చనిపోవాలని అనుకున్నానని ఆ స్టేజ్ దాటితే కొత్త జీవితం మొదలౌతుందని అంటున్నాడు రెహమాన్ .

- Advertisement -

English Title: I had suicidal thoughts says ar rahman

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All