
ఆర్ఆర్ఆర్ టికెట్స్ ఉన్నాయా..? ఎక్కడ దొరుకుతున్నాయి…? ఎంతైనా సరే తీసుకుంటాం..? ఎవరి దగ్గరైన ఉంటె చెప్పండి..? ప్రస్తుతం ఇవే మాటలు అంతటా వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటులు ఎన్టీఆర్ , చరణ్ కలిసి నటిస్తుండడం , రాజమౌళి డైరెక్ట్ చేయడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటె హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూటర్స్ స్వయంగా టికెట్లు బ్లాక్ చేసి మరీ భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో టికెట్ల రేట్లు భారీగా ఉండడంతో చాలామంది తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు సినిమా చూడాలనే కోరిక ఉన్నప్పటికీ, టికెట్ ధరలు విపరీతంగా ఉండడం తో సినిమా చూడాలనే కోరిక ఉన్నప్పటికీ చూడలేంలే అని మనసు చంపుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొంతమంది ఏదో రకంగా సినిమా చూడాలని అనుకున్నప్పటికీ ..కొంతమంది డిస్ట్రబ్యూటర్స్ హైదరాబాద్ లో రేపటి షోలకు సంబంధించిన టికెట్లను బ్లాక్ చేసి పెట్టుకున్నారు. వాటిని భారీ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్ లలో కూడా డిస్ట్రిబ్యూటర్లు స్వయంగా టికెట్లను బ్లాక్ చేసి పెట్టి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో టికెట్ ధర దాదాపు మూడు వేలకు అమ్ముడుపోతున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్స్ కు సంబంధించిన వారితోనే ఈ తరహా దందాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.