Homeటాప్ స్టోరీస్మణికర్ణిక తెలుగు ట్రైలర్ అదరహో

మణికర్ణిక తెలుగు ట్రైలర్ అదరహో

Huge response for Manikarnika telugu Trailerవీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ” మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ”. ఇప్పటికే హిందీ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది . కాగా ఈరోజు మణికర్ణికా తెలుగు ట్రైలర్ ని హైదరాబాద్ లో విడుదల చేసారు . ఈ వేడుకకు కంగనా రనౌత్ తరలివచ్చింది . అలాగే చిత్ర కథకుడు విజయేంద్ర ప్రసాద్ కూడా హాజరయ్యాడు . ఇక తెలుగు ట్రైలర్ కూడా అదరహో అనే లెవల్ లో ఉంది .

వీరనారి ఝాన్సీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఝాన్సీ ని ఆవహించినట్లుగా కనిపించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేసింది కంగనా రనౌత్ . మణికర్ణిక ట్రైలర్ చూసిన వాళ్ళు ఝాన్సీ రాణి ధైర్య సాహసాల గురించి మరోసారి నెమరు వేసుకుంటున్నారు . ఈ చిత్రాన్ని జనవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు మొదట దర్శకుడు మన క్రిష్ కానీ కంగనా రనౌత్ తో వచ్చిన విబేధాల వల్ల మిగతా బ్యాలెన్స్ వర్క్ కంగనా పూర్తి చేసింది .

- Advertisement -

English Title: Huge response for Manikarnika telugu Trailer

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All