Homeటాప్ స్టోరీస్అభిమానులను దోచేస్తున్న మహర్షి

అభిమానులను దోచేస్తున్న మహర్షి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో మహర్షి స్పెషల్ షోలకు అనుమతి లభించింది దాంతో దోపిడీ మొదలయ్యింది . వీరాభిమానులు తప్పకుండా మహర్షి చిత్రాన్ని స్పెషల్ షోలలో చూడాలని ఉత్సాహపడుతుంటారు . అటువంటి వాళ్ళ ని ఆసరాగా చేసుకొని దోపిడీకి దిగుతున్నారు స్పెషల్ షో నిర్వాహకులు . మహేష్ బాబు కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు , అందుకే స్పెషల్ షోల పర్మీషన్ తెచ్చుకున్నారు .

ఈ స్పెషల్ షోల టికెట్ రేట్లు 200 నుండి 2000 వరకు ఉంది అంటే ఎంత దారుణమో ! ఎంత త్వరగా సినిమా చూద్దామా అన్న వాళ్ళ ఆత్రుత ని క్యాష్ చేసుకుంటున్నారు నిర్వాహకులు . ఇక వీరాభిమానులు కూడా రెచ్చిపోయి అభిమాన హీరో సినిమాని చూడాలని ఉత్సాహం కొద్దే అప్పు చేసి మరీ టికెట్లు కొనేవాళ్ళు ఉన్నారు . మహర్షి చిత్రం ఈనెల 9 న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts