Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ సినిమాకు భారీ ఆఫర్

ఎన్టీఆర్ సినిమాకు భారీ ఆఫర్

huge offer in overseas for ntr trivikram filmయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా లోని ఎన్టీఆర్ లుక్ ని ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు . నిన్ననే ఎన్టీఆర్ అభిమానులను సిద్ధంగా ఉండమని ట్వీట్ చేసారు ఆ చిత్ర బృందం . ఆల్రెడీ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ నెట్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తుండగా అధికారికంగా చిత్ర బృందం విడుదల చేసే స్టిల్ ఎలా ఉంటుందో అన్న ఆత్రుత నెలకొంది అభిమానుల్లో .

ఇక అసలు విషయానికి వస్తే ……. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది . ఎన్టీఆర్ వరుస విజయాలు సాధిస్తుండటంతో పాటు త్రివిక్రమ్ యాడ్ అయ్యాడు కాబట్టి ఓవర్ సీస్ లో ఈ సినిమాని దక్కించుకోవడానికి 12 కోట్లు ఆఫర్ ఇచ్చారట . అయితే ఇంకా అమ్మలేదు కానీ మంచి ఆఫర్ కదా ! అని ఆలోచిస్తున్నారట నిర్మాత . ఇదే నిర్మాత పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యింది దాంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు . దాంతో కొంత తర్జన భర్జన పడుతున్నారట . మొత్తానికి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ బయ్యర్ల ని టెంప్ట్ చేస్తోంది అందుకే భారీ ఆఫర్ లు వస్తున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All