Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ బయ్యర్ కు నష్టం తప్పదు

ఓవర్సీస్ బయ్యర్ కు నష్టం తప్పదు

Huge loss for 2.0 distributor in overseas సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అందునా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ కావడంతో బయ్యర్ లు పోటీపడి మరీ ఓవర్ సీస్ లో 2. ఓ చిత్రాన్ని కొన్నారు . కట్ చేస్తే ఆ స్థాయి వసూళ్లు అక్కడ రావడం లేదు . ఓవర్ సీస్ లో బయ్యర్లు లాభాల్లోకి వెళ్లాలంటే 7 మిలియన్ డాలర్లు వసూల్ చేయాలి 2. ఓ కానీ పరిస్థితి చూస్తుంటే అయిదు మిలియన్ డాలర్లు దాటితే అదే గొప్ప అన్నట్లుగా ఉంది పరిస్థితి దాంతో ఓవర్ సీస్ బయ్యర్ నష్టపోవడం ఖాయమైపోయింది . ఆరంభం అదిరితే బయ్యర్లు కాస్త నమ్మకంతో ఉండేవాళ్ళు కానీ ప్రారంభంలో తడబాట్లు మొదలయ్యాయి దాంతో లాభాల సంగతి పక్కన పెడితే పెట్టిన పెట్టుబడి లోనే కొంత నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది .

రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ గత ఎనిమిదేళ్లుగా నష్టాలను తెస్తూనే ఉన్నాయి . అయినప్పటికీ ధైర్యం చేసి 2. ఓ ని కొన్నారు . కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు . 2. ఓ విజువల్ వండర్ అయితే హాలీవుడ్ చిత్రాలను ఎప్పటి నుండో చూస్తున్న వాళ్లకు ఈ 2. ఓ మాములు చిత్రంగా తోచింది . దాంతో కాబోలు 2. ఓ ని పట్టించుకోవడం లేదు పాపం .

- Advertisement -

English Title:  Huge loss for 2.0 distributor in overseas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All