Homeఎక్స్ క్లూసివ్వినయ విధేయ రామ బ్లాక్ బస్టరా ?

వినయ విధేయ రామ బ్లాక్ బస్టరా ?

Huge expectations on Vinaya vidheya rama
Ram Charan

పేరుకి వినయ విధేయ రామ కానీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం బీభత్సకాండ లా ఉంది . రాంచరణ్ అరివీర భయంకరంగా పోరాడుతున్న దృశ్యాలు మెగా ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తాయి . ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ తో పాటుగా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చడం ఖాయంగా కనిపిస్తోంది అంటే బ్లాక్ బస్టర్ అన్నమాటే ! పైగా సంక్రాంతి సెలవులు కూడా చరణ్ కు కలిసి వస్తాయి కాబట్టి భీకరమైన ఓపెనింగ్స్ అయితే తెచ్చుకోవడం ఖాయం .

సినిమా బాగుంటే బాక్స్ లు బద్దలు కావాల్సిందే . చరణ్ మేనియా కి తోడు మాస్ పల్స్ తెలిసిన దర్శకులు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు దాంతో వినయ విధేయ రామ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి . చరణ్ సరసన హాట్ భామ కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 11 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంతో రాంచరణ్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు మెగా ఫ్యాన్స్ . ఇక మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సినిమా చూస్తానని అంటున్నాడు .

- Advertisement -

English Title: Huge expectations on Vinaya vidheya rama

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All