Homeటాప్ స్టోరీస్నాని అ ! పై అంచనాలు బాగానే ఉన్నాయి

నాని అ ! పై అంచనాలు బాగానే ఉన్నాయి

huge expectations on nani film aweహీరో నాని నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ” అ !”  . కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 16న రిలీజ్ చేస్తున్నారు . కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ , రెజీనా , ఈషా రెబ్బా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నాని చేప కు వాయిస్ అందించాడు అలాగే రవితేజ కూడా ఓ చెట్టు కు వాయిస్ ఇచ్చాడు . విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎందుకంటే తొలిసారిగా నిర్మాతగా మారి కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే నిర్మించిన చిత్రం కావడంతో విశేషం .

నిత్యా మీనన్ కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది అలాగే రెజీనా నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించనుంది ,ఇప్పటికే రెజీనా గెటప్ కు విపరీతమైన అప్లాజ్ వచ్చింది . హీరోగా వరుస విజయాలు సాధిస్తున్న నాని నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరో రెండు రోజుల పాటు ఎదురు చూడాల్సిందే . ఈ నెల 16న సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే అ చిత్రానికి మంచి క్రేజ్ లభించింది . 

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All