Homeఎక్స్ క్లూసివ్200 కోట్ల బడ్జెట్ అంటే ఆ హీరో తో వర్కౌట్ అవుతుందా ?

200 కోట్ల బడ్జెట్ అంటే ఆ హీరో తో వర్కౌట్ అవుతుందా ?

Huge budjet for Hiranya kashyapa
Rana

నటుడిగా రానా నిరూపించుకున్నాడు కానీ హీరోగా మాత్రం సాలిడ్ హిట్ ఇంతవరకు కొట్టలేకపోయాడు . బాహుబలి సిరీస్ లలో వచ్చిన చిత్రాలతో దేశ వ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు అలాగే ఘాజి సినిమాతో హిట్ కొట్టాడు కానీ రానా కు ప్రత్యేకించి గొప్ప మార్కెట్ లేదు అయినప్పటికీ ధైర్యం చేసి 200 కోట్ల భారీ బడ్జెట్ తో ” హిరణ్య కశ్యప ” అనే సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు గుణశేఖర్ . గతకొంత కాలంగా గుణశేఖర్ కు  సరైన సక్సెస్ లేదు , అనుష్క తో చేసిన రుద్రమదేవి చిత్రం హిట్ అయ్యింది అలాగే మంచి వసూళ్ల ని రాబట్టింది కానీ విమర్శలు కూడా వచ్చాయి .

బడ్జెట్ ఎక్కువ కావడం , సినిమా ఆలస్యం కావడం వల్ల రుద్రమదేవి విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు గుణశేఖర్ . మరి ఇప్పుడు ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో హిరణ్య కశ్యప అనే చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు . ఈ సినిమాలో రానా కూడా పార్ట్ నర్ . రానా తో సినిమా చేయడం వల్ల బాలీవుడ్ లో కూడా కొంత మొత్తం వస్తుంది కాబట్టి ధైర్యం చేస్తున్నారు . అయితే ఆ స్థాయి బడ్జెట్ రానా తో వర్కౌట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . సినిమా బ్లాక్ బస్టర్ అయితే డబ్బులు వస్తాయి కాకపోతే …… !

- Advertisement -

English Title: Huge budjet for Hiranya kashyapa

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All