Homeఎక్స్ క్లూసివ్స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్

స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్

Hrithik roshan father Rakesh roshan suffering with cancer బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్ కు క్యాన్సర్ సోకిందని స్వయంగా హృతిక్ రోషన్ వెల్లడించాడు .  తన తండ్రికి క్యాన్సర్ అని ఈరోజు ఉదయం తండ్రితో కలిసి దిగిన ఫోటోని  ట్వీట్ చేసాడు హృతిక్ రోషన్ . అయితే ఈరోజు సర్జరీ జరుగుతుందని కూడా ప్రకటించాడు . హృతిక్ ట్వీట్ తో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది . ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు క్యాన్సర్ బారిన పడగా తాజాగా ఆ కోవలోకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కూడా చేరాడు .

రాకేష్ రోషన్ నటుడు కూడా అప్పట్లో , అయితే ఆ తర్వాత కాలంలో నటన మానేసి కొడుకు కోసం నిర్మాతగా దర్శకుడిగా మారాడు . హృతిక్ రోషన్ తో పలు హిట్ చిత్రాలను నిర్మించి , దర్శకత్వం వహించి స్టార్ హీరోగా నిలబెట్టాడు . హృతిక్ రోషన్ హీరోగా నిలబడ్డాడంటే అందుకు  తండ్రి రాకేష్ రోషన్ కృషి కారణం అనే చెప్పాలి . రాకేష్ కి క్యాన్సర్ అని చెప్పగానే అతడు క్యాన్సర్ మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు హృతిక్ అభిమానులు .

- Advertisement -

English Title : Hrithik roshan father Rakesh roshan suffering with cancer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All