Homeటాప్ స్టోరీస్వరుణ్ తేజ్ గని కోసం హోలీవడ్ టీమ్ దిగుతోంది

వరుణ్ తేజ్ గని కోసం హోలీవడ్ టీమ్ దిగుతోంది

వరుణ్ తేజ్ గని కోసం హోలీవడ్ టీమ్ దిగుతోంది
వరుణ్ తేజ్ గని కోసం హోలీవడ్ టీమ్ దిగుతోంది

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇది బాక్సింగ్ బేస్డ్ యాక్షన్ డ్రామా. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా రకరకాల రూమర్స్ షికార్లు చేసాయి. అయితే వీటన్నిటినీ టీమ్ పటాపంచలు చేసింది.

ఇంకా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ ను గని కోసం దించుతోంది. వివిధ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన లార్నెల్ స్టోవెల్, రీంబుర్ లు గనిలో బాక్సింగ్ ఘట్టాలను కొరియోగ్రాఫ్ చేయనున్నారు. హైదరాబాద్ లో భారీ స్టేడియం సెట్ ను ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం నిర్మించారు.

- Advertisement -

అక్కడే ఈ చిత్ర బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా సైయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All