Homeగాసిప్స్అఫీషియ‌ల్‌: `హిట్‌2`లో అడివి శేష్

అఫీషియ‌ల్‌: `హిట్‌2`లో అడివి శేష్

Nani HIT 2 with Adivi Sesh
Nani HIT 2 with Adivi Sesh

మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్‌`.  నేచుర‌ల్ స్టార్ నాని వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ గా `హిట్ 2` పేరుతో మ‌రో క్రైమ్‌ థ్రిల్ల‌ర్ నిర్మించ‌బోతున్నారంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శ‌నివారం వచ్చింది. దీనికి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని నిర్మాత నేచురల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. ఇందులో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అడివి శేష్ సైడ్ వ్యూలో క‌నిపిస్తుండ‌గా  పక్కన ఒక కుక్క క‌నిపిస్తోంది. అంటే దీన్ని బ‌ట్టి అడివిశేష్ పాత్ర ఎంత ప‌వ‌ర్‌ఫుల్ అన్న‌ది అర్థమ‌వుతోంది. ఇందులో అడివిశేష్ కృష్ణ దేవ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ హీరో నాని .. అడివి షేష్‌కు `హిట్‌2` ప్రాజెక్ట్‌లోకి స్వాగతం` అని ట్వీట్ చేశారు.

- Advertisement -

హిట్‌ రెండవ కేసు. బిగ్గ‌ర్‌, బెట‌ర్‌, ఆస్‌..  నేను `మేజర్` పూర్తి చేసిన తర్వాత షూట్ మొదలవుతుంది  నా అభిమాన నానితో అద్భుతమైన ప్రశాంతి త్రిపిర‌నేని,  ప్రతిభావంతులైన కోలను శైలేష్ తో క‌లిసి ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది`అని అడివిశేష్ ట్వీట్ చేశారు. మొదటి భాగం ని మించి ఈ రెండవ భాగం మ‌రింత ఇంట్రెస్టింగ్ వుండ‌నుంద‌ట‌.  సినిమాటోగ్రఫీ కోసం మణికందన్, ఎడిటింగ్ కోసం గ్యారీ బిహెచ్ వంటి గ్రేట్ టెక్నీషియన్‌లు ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌బోతున్నారు. సంగీతం జాన్ స్టీవర్ట్ ఎడూరి అందించ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All