Homeటాప్ స్టోరీస్హిట్టు కొట్టిన ఎన్టీఆర్

హిట్టు కొట్టిన ఎన్టీఆర్

Hit talk to Ntr's Aravinda samethaయంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ హిట్టు కొట్టాడు . 2015 లో టెంపర్ చిత్రంతో హిట్ కొట్టి మళ్ళీ లైన్ లోకి వచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత నుండి వరుసగా విజయాలు సాధిస్తూనే ఉన్నాడు . టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ , జై లవకుశ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఎన్టీఆర్ తాజాగా అరవింద సమేత చిత్రంతో ఆ జోరు ని మరింతగా పెంచాడు . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన అరవింద సమేత చిత్రానికి హిట్ టాక్ వచ్చింది . ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోలతోనే హాఫ్ మిలియన్ డాలర్లను రాబట్టాడు ఎన్టీఆర్ . ఇక ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవులు కాబట్టి భారీ వసూళ్ళ ని సాధించడం ఖాయం .

ఎన్టీఆర్ నటన కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు . త్రివిక్రమ్ డైరెక్షన్ , ఎన్టీఆర్ నటన వెరసి రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత తో ఎన్టీఆర్ అయిదవ విజయాన్ని నమోదు చేసుకున్నాడు . వరుసగా అయిదు చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్ . యాక్షన్ దృశ్యాలతో పాటుగా సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా ఉందని అంటున్నారు . కొంతమంది పెదవి విరుస్తున్నప్పటికి మొత్తానికి ఎన్టీఆర్ అరవింద సమేతతో హిట్ కొట్టాడు .

- Advertisement -

English Title: Hit talk to Ntr’s Aravinda sametha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All