Homeటాప్ స్టోరీస్లారెన్స్ ని అవమానించారట

లారెన్స్ ని అవమానించారట

హీరో , దర్శకుడు అయిన లారెన్స్ ని అవమానించడంతో బాలీవుడ్ చిత్రం నుండి తప్పుకున్నాడు . ఈ విషయాన్నీ లారెన్స్ స్వయంగా ట్వీట్ చేయడం విశేషం . కాంచన తెలుగు , తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఇదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ” లక్ష్మీ బాంబ్ ” అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు . ఇక ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే లక్ష్మీ బాంబ్ చిత్రానికి సంబంధించి దర్శకుడు లారెన్స్ అయినప్పటికీ కీలక విషయాలు ఏవి లారెన్స్ కు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు నిర్మాతలు దాంతో నన్ను ఘోరంగా అవమానించే చోట పనిచేయడం కంటే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే బెటర్ అని భావించాడట లారెన్స్ అందుకే లక్ష్మీ బాంబ్ నుండి తప్పుకోవడమే కాకుండా ఈ విషయం గురించి ట్వీట్ కూడా చేసాడు . అంతేగా …… దర్శకుడిగా పేరు ఉండి ఆ పని చేయించనప్పుడు దాన్నుండి తప్పుకోవడమే బెటర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All