Homeఎక్స్ క్లూసివ్విశాల్ ని విడుదల చేసిన పోలీసులు

విశాల్ ని విడుదల చేసిన పోలీసులు

Hero Vishal released
Vishal

హీరో విశాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిన్న సాయంత్రం విడుదల చేసారు . నిర్మాతల మండలి అధ్యకుడు అయిన విశాల్ ఛాంబర్ కు కొంతమంది నిర్మాతలు వచ్చి తాళాలు వేసిన విషయం తెలిసిందే . ఆ తాళాలను బద్దలు కొట్టడానికి వెళ్లిన విశాల్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు . అయితే విశాల్ ని అరెస్ట్ చేస్తున్న సమయంలో తీవ్రంగా ప్రతిఘటించాడు . దాంతో టి నగర్ నుండి మరోచోటికి తరలించారు .

అయితే స్టేషన్ కు తీసుకెళ్లాకా కొద్దిసేపు అక్కడే ఉంచి సాయంత్రం విడుదల చేసారు . పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన విశాల్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసాడు . నిర్మాతల మండలికి అధ్యక్షుడి ని నేను అలాంటిది నన్ను మా ఆఫీసుకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటో అర్ధం కాలేదు , పోలీసుల తీరు చాలా దారుణంగా ఉంది అని విరుచుకుపడ్డాడు . నిర్మాతల మండలిలో కొంతమంది చిచ్చు పెట్టడానికి చూస్తున్నారు . ఇళయరాజా సంగీత విభావరిని ఎవరూ అడ్డుకోజాలరు అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసాడు విశాల్ .

- Advertisement -

English Title :Hero Vishal released

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All