
హీరో విశాల్‌కు చెందిన ఫిల్మ్ ఫ్యాక్టరీలో పనిచేసిన రమ్య తమ ఆఫీసులో అకౌంట్స్ మార్చి 45లక్షలు కాజేసిందని సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న హరి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రమ్యపై చెన్పైలోని విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. దీంతో విశాల్‌కు, రమ్యకు మధ్య వివాదం మొదలైంది.
విశాల్ తెర పై హీరో కానీ తెర వెనుక మాత్రం తను విలన్ అని, అతనికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు తన ముందే జరిగాయని, వాటికి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని రమ్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనపై విశాల్ అభియోగం మోపడం వెనక ఆయన మేనేజర్ హరి వున్నాడని రమ్య ఆరోపణలు చేసింది.
ఇదిలా వుంటే హరి కారుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అది చేసింది రమ్యకు చెందిన మనుషులే నని తనకు అనుమానం వుందని హరి కోడంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం తారా స్థాయికి చేరేలా కనిపిస్తోందని తమిళ వర్గాలు అంటున్నాయి.